News March 8, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి..

image

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి చిన్న కిష్టాపూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ జవహర్ లాల్(50) చికిత్స పొందుతూ మృతిచెందారు. కార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. జవహర్ లాల్ కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కారు అదుపు తప్పి ఇనుప బోర్డ్‌కు ఢీ కొట్టింది.

Similar News

News March 14, 2026

మెదక్: ‘ఎస్సీలకు ఆర్థిక సాయం..17లోగా దరఖాస్తు చేసుకోండి’

image

మెదక్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ. 236.60 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీని ద్వారా 249 మందికి లబ్ధి కలగనుంది. ఇందులో 119 ఈవీ బైక్‌లు, 59 ఆటో రిక్షాలు, 12 వ్యవసాయ యూనిట్లు కేటాయించారు. ఆసక్తిగల వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్ నగేష్

image

మెదక్ జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అదనపు కలెక్టర్ నగేష్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ చేసేలా చూడాలని ఆదేశించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

News March 14, 2026

శివంపేట: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.