News March 8, 2025

హనుమకొండ జిల్లాలో MURDER.. కారణం ఇదే..!

image

హనుమకొండ(D),ఎల్కతుర్తి(M), వీరనారాయణ గ్రామంలో తల్లి రేవతిని <<15683962>>కొడుకు చంపిన<<>> విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కుమారస్వామి,రేవతి(40) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు అజయ్(23) 2ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి 15ఏళ్ల క్రితం చనిపోగా తల్లి పెద్దకొడుకు వద్ద ఉంది. రాత్రి తాగొచ్చిన అజయ్ తల్లిని గొడ్డలితో నరికి చంపాడు.

Similar News

News November 6, 2025

భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షియస్, బార్ట్‌లెట్, ఇల్లిస్, జంపా.

News November 6, 2025

మరిపెడ: ACBకి చిక్కిన AEO

image

మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిలికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) గాడిపెల్లి సందీప్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

image

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.