News March 8, 2025

HYD: ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

image

ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు అమర్ దీప్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News March 7, 2026

రంగారెడ్డి: బాలికలకు రేపు HPV

image

బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన HPV టీకా కార్యక్రమ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఈ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలిత దేవి తెలిపారు. అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

News March 7, 2026

రేపటి నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ: డీఎంహెచ్‌ఓ

image

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ లలిత తెలిపారు. శనివారం ఆమె ఆమనగల్లులో మాట్లాడుతూ.. మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు 4 విడతల్లో చేస్తామని వెల్లడించారు. అలాగే, రేపటి నుండి జిల్లావ్యాప్తంగా హెచ్‌పీవీ(HPV) వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

News March 6, 2026

RR: మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆరుగురు స్టూడెంట్స్

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నిఘా నీడలో ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగాయి. 67,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,087 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా, ఒకే సెంటర్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులు స్క్వాడ్‌కు పట్టుబడ్డారు.