News March 8, 2025
భీమిని: హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు

భీమిని మండలంలోని జగ్గయ్యపేట ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం రేగుచెట్టు రమేశ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News March 1, 2026
మండపేట: క్షణికావేశంలో హత్య.. కటకటాలపాలైన అన్నదమ్ములు

మండపేట మండలం ద్వారపూడిలో గురువారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులైన అన్నదమ్ములు అయినవిల్లి చంద్రపాల్, గిరిబాబు పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావును రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపారు. ఆవేశంలో చేసిన ఈ దాడితో సూర్య ప్రకాశరావు మృతి చెందగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2026
కనువిందుగా భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News March 1, 2026
నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.


