News March 8, 2025

నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన పెదిరెడ్ల జగదీశ్ అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి చెట్టుపల్లి గ్రామం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ రాజారావు తెలిపారు.

Similar News

News September 13, 2025

6 లైన్ల రోడ్డు: బీచ్ రోడ్ To భోగాపురం.. వయా భీమిలి..!

image

భోగాపురం ఎయిర్‌పోర్టుతో సిటీకి కనెక్టెవిటీ పెంచేందుకు బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రోడ్డు స్థానిక రాజకీయ నాయకుల భూమి విలువలు పెరగడానికి అవకాశం కల్పించిందని విమర్శలొచ్చాయి. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలోనే రోడ్డు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం.

News September 13, 2025

‘గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

image

గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News September 13, 2025

పుత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

పుత్తూరు పట్టణంలోని పరమేశ్వరమంగళం KKC కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న లారీ అతివేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సతీశ్ అరక్కోణం మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన సతీశ్, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.