News March 8, 2025

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

image

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వరుడు కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కిరణ్ ఆత్యహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Similar News

News November 6, 2025

భీమవరం: కలెక్టరేట్ శాశ్వత భవనం ఎక్కడ..?

image

పశ్చిమ గోదావని జిల్లాకు నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణం ఎక్కడ చేయాలనే అంశంపై కొంతకాలం పెద్ద వివాదం నడిచింది. జిల్లాలోని పెద్ద చర్చి ప్రదేశం అంశంగా కూడా ఈ వివాదం జరిగింది. ప్రస్తుతం ఆ వివాదాలు కనుమరుగై, కలెక్టరేట్ ఊసే లేకుండా పోయింది. భీమవరంలో నిర్మిస్తారా, ఉండిలో ఏర్పాటు చేస్తారా లేక నరసాపురం తరలిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News November 6, 2025

విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

image

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

News November 6, 2025

బీస్ట్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. లుక్‌పై నీల్ ఫోకస్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్‌లోకి మారనున్నారు. ‘NTR-NEEL’ మూవీ కోసం ఆయన లుక్ పూర్తిగా మారబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, బియర్డ్‌ ఎలా ఉండాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో సెట్ చేయించారు. తారక్ లుక్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.