News March 8, 2025
మహిళా గళం.. అసెంబ్లీలో తగ్గేదేలే!

అసెంబ్లీలో జిల్లా మహిళా ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. ఆసక్తికర స్పీచులతో ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. MLAలు <
#Women’sDay
Similar News
News September 18, 2025
APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.
News September 18, 2025
కాగజ్‌నగర్: కోనప్పను కలిసిన మిషన్ భగీరథ వర్కర్స్

కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను మిషన్ భగీరథ సూపర్వైజర్, వాల్ ఆపరేటర్, హెల్పర్లు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కోనప్పకు వినతిపత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆయన మిషన్ భగీరథ వర్కర్ల సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
News September 18, 2025
పెనమలూరు టీడీపీ నేతకు కీలక పదవి

పెనమలూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత బొర్రా రాధాకృష్ణ (గాంధీ) శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం పలు ఆలయాలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించగా.. దుర్గగుడి ఛైర్మన్‌గా గాంధీకి అవకాశం లభించింది. కాగా గాంధీ.. హిందూపూర్ MLA బాలకృష్ణకు అత్యంత సన్నిహితులు. తెలుగు రాష్ట్రాలలో పలు సేవాకార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు.