News March 8, 2025

మెట్ పల్లి: ఆరోగ్య సమస్యలతోనే నవవరుడు ఆత్మహత్య

image

మెట్‌పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామం రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే<<15688708>> నవ వరుడు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా తమకు చెప్పలేదని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News December 28, 2025

ప్రముఖ ఫ్రెంచ్ నటి కన్నుమూత

image

ప్రముఖ ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బార్డోట్(91) మరణించారు. నటి, మోడల్‌, సింగర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సదరన్ ఫ్రాన్స్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతనెల అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె వృద్ధాప్య సమస్యలతోనే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News December 28, 2025

PHOTO: వరి నాట్లు వేసిన బండారు శ్రావణి

image

శింగనమలలోని శివాలయం పరిసర ప్రాంతాలు, శ్రీరంగరాయ చెరువు ఆయకట్టు పరిధిలో కూలీలతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వరి నాట్లు వేశారు. రబీ సీజన్‌లో వరి పంటకు సాగునీటి కోసం ఆందోళన చెందుతూ రైతులు ఇటీవల ఎమ్మెల్యేను కలిశారు. వారి అభ్యర్థన మేరకు ఇవాళ పొలాలను సందర్శించి, పరిశీలించారు. సాగు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై రైతులతో మాట్లాడారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

News December 28, 2025

ఆ అధికారుల చొరవతో గుంటూరు జిల్లా శుభిక్షం

image

2025లో గుంటూరు జిల్లా వరుస తుఫాన్లు, ప్రమాదాలు, ప్రకృతి వపత్తులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
సమర్థవంతమైన పాలనతో వాటి నుంచి జిల్లాను సురక్షితంగా నడిపించిన నలుగురు అధికారుల పాత్ర కీలకంగా నిలిచింది. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి, SP సతీష్ కుమార్‌తో పాటు ప్రస్తుత కలెక్టర్ తమీమ్ అన్సారియా, SP వకుల్ జిందల్ సమన్వయంతో తీసుకున్న చర్యలతో జిల్లా శుభిక్షంగా ఉందని ప్రజలు అంటున్నారు.