News March 8, 2025
ఏలూరు: చేపల చెరువులకు నీరు ఇవ్వాలని వినతి

వేసవి నేపథ్యంలో నీటి కొరత ఉందని.. చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. వినతిపత్రం అందజేశారు. నీటి కొరత కారణంగా జిల్లాలో చేపలు సాగు చేస్తున్న తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు.
Similar News
News April 18, 2026
విశాఖలో ఒక్కరోజే 2,430 కేసులు నమోదు

విశాఖలోని శుక్రవారం ఒక్కరోజే 2,430 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,137, పిలియన్ రైడర్-223, ట్రిపుల్ రైడింగ్- 82, ఓవర్ స్పీడ్-220, సెల్ఫోన్ డ్రైవింగ్-28, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-15, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-180, డ్రంకన్ డ్రైవింగ్-35, సీజ్ అయిన వెహికల్స్-43, ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-547 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 20 బస్సులు తనిఖీ చేశారు.
News April 18, 2026
అనంత: RDT గుడ్ న్యూస్

ఉమ్మడి అనంత జిల్లా ప్రజలకు RDT తీపి కబురు చెప్పింది. 2004లో పేద పిల్లల కోసం ఆ సంస్థ ప్రవేశపెట్టిన విద్యా పథకాన్ని పున:ప్రారంభించేందుకు నిర్ణయించారు. పథకంలో కొన్ని మార్పులు చేసి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింది ఇప్పటి వరకు 5,400 మంది విద్యార్థులు చదువుకున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాగానే ప్రకటన చేయనున్నట్లు సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు.
News April 18, 2026
యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.


