News March 8, 2025
వారులేనిదే సృష్టి లేదు: ఎమ్మెల్యే బండారు

సర్వం మహిళా మూర్తులేనని, వారులేనిదే సృష్టి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా.. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
అనంత: బైక్ కొనివ్వలేదని సూసైడ్

బైక్ కొనివ్వలేదని క్షణికావేశంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడిపత్రి మండలం చల్లవారిపల్లి సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడు టైలర్స్ కాలనీకి చెందిన నాగేంద్ర, కళావతి దంపతుల కుమారుడు సాయికిరణ్(21)గా రైల్వే పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News March 3, 2026
పెద్దపల్లి: హోలీ స్పెషల్ ట్రైన్

హోలీ పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి – దానాపూర్ మధ్య ఈనెల 5 నుంచి 29 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో (03226) రైలు బయలుదేరుతుంది. ప్రతీ గురువారం రాత్రి 8:50 గంటలకు (03225) రైలు బయలుదేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి స్టేషన్‌లలో ఆగుతుందని, ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News March 3, 2026
యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటి వరకు 787 మంది మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్‌లోని కీలక సైనిక కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రాణనష్టం పెరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 1,000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరణించారు.


