News March 8, 2025
ఏలూరులో మంత్రి నాదెండ్ల పర్యటన

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్త్రీ, పురుషుల కోసం విశ్రాంతి బ్యారక్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం విశ్రాంతి బ్యారక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేశ్, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 9, 2026
కొత్త బీడీ పొగాకు రకం ‘ABD 132’.. దీని ప్రత్యేకత ఏమిటి?

ABD 132 బీడీ పొగాకు రకాన్ని నంద్యాల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ రకం పంటకాలం 195 నుంచి 210 రోజులుగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేయడానికి ఈ రకం అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర బీడీ పోగాకు రకాలతో పోలిస్తే దీని పొగలో హానికర అంశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో మితిమీరుతున్న ప్రైవేటు ఫైనాన్స్ ఆగడాలు..!

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని ‘రోజులు’, ‘వారాల’ వడ్డీల పేరుతో రక్తాన్ని పీల్చుతున్నారు. అప్పుతీర్చడం ఆలస్యమైతే అధిక వడ్డీలు, వేధింపులతో బెంబేలెత్తిస్తుండటంతో సామాన్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు స్పందించి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేదలను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.
News January 9, 2026
విద్యుత్ ఛార్జీలపై సీఎం గుడ్ న్యూస్

AP: కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ ₹5.19గా ఉండేదని, దాన్ని ₹4.90కి తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్చి నాటికి మరో 10 పైసలు, మూడేళ్లలో ₹1.19 తగ్గించి యూనిట్ ₹4కే అందిస్తామన్నారు. 2019-24 నాటి ట్రూఅప్ ఛార్జీల భారం ₹4,498 కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం గందరగోళ నిర్ణయాలు అమలు చేసిందని విమర్శించారు.


