News March 8, 2025

మహిళల పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే..

image

ఫైనాన్షియల్ ఫ్యూచర్, ఇండిపెండెన్సీపై మహిళల ఆలోచనా తీరు మారింది. వారి పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే కేటాయిస్తున్నారని డేటా చెబుతోంది. ప్రస్తుత FYలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న స్త్రీల సంఖ్య 18% పెరిగిందని పాలసీ బజార్ తెలిపింది. ఇందులో వేతన జీవులు 49%, హోమ్‌మేకర్స్ 39% అని పేర్కొంది. యంగర్ విమెన్ ఆర్థిక అంశాల్లో చురుగ్గా ఉంటున్నారని మణిపాల్ సిగ్నా రిపోర్ట్ వెల్లడించింది.

Similar News

News March 28, 2026

వారిని అన్‌ఫాలో చేసిన రిషబ్.. శాండల్‌వుడ్‌లో కలకలం

image

‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. డైరెక్టర్, నటుడు రాజ్ బీ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం కలకలం రేపింది. వారితో విభేదాలతోనే ఇలా చేశారని టాక్ నడుస్తోంది. దీనిపై ఎవరూ స్పందించలేదు. రాజ్‌తో కల్ట్ క్లాసిక్ ‘గరుడ గమన వృషభ వాహన’, రుక్మిణీతో కాంతార: చాప్టర్1 చిత్రాల్లో రిషబ్ నటించారు.

News March 28, 2026

‘చికెన్‌పాక్స్’ జీవితంలో ఒక్కసారే ఎందుకు వస్తుంది?

image

మనకు జ్వరాలు, ఇన్ఫెక్షన్లు అనేకసార్లు వస్తాయి. కానీ చికెన్‌పాక్స్(ఆటలమ్మ/అమ్మవారు) ఓసారి వస్తే మళ్లీ రాదు. దీనికి కారణాలు తెలుసుకుందాం. వెరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల ఈ అంటువ్యాధి వస్తుంది. తీవ్రమైన దురద, దద్దుర్లు, జ్వరం, అలసట దీని లక్షణాలు. 5-7 రోజులకు తగ్గుతుంది. ఈ వ్యాధి సోకగానే శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలు జీవితకాల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మళ్లీ వైరస్ సోకినా వెంటనే అంతం చేస్తాయి.

News March 28, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.