News March 8, 2025
అనకాపల్లి కలెక్టర్, జేసీని సత్కరించిన మంత్రి

అనకాపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవిని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు. ఈ సందర్భంగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 13, 2026
కర్నూలు జిల్లాకు వాటితో ముప్పు..!

కర్నూలు జిల్లాలోని రెండు మండలాల భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు’ తాజాగా హెచ్చరించింది. దేవనకొండ మండలం కరివేములలో అత్యధికంగా 50.7 ppb సాంద్రత నమోదవ్వగా, ఆదోని మండలం నాగనాథనహల్లిలో 63.6 ppb ఉన్నట్లు గుర్తించారు. 30 ppbలోపు ఉంటేనే సురక్షితమని, ఇంతటి భారీ సాంద్రత వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.
News January 13, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.


