News March 8, 2025
కోనసీమ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

ఈనెల 10వ తేదీన అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని డీఆర్వో రాజకుమారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం గతంలో మాదిరిగానే జరుగుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిందన్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News March 18, 2026
PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News March 18, 2026
నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.
News March 18, 2026
తిరుపతిలో దొంగల ముఠా అరెస్ట్