News March 8, 2025

VKB: మహిళలు లక్ష్యాన్ని అలవొకగా ఛేదిస్తారు: జ్వాలా

image

మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.

Similar News

News April 1, 2026

JGTL: రాజకీయాల్లో కీలక మలుపు.. తెరపైకి చరిష్మా రెడ్డి?

image

JGTL జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌తో 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి త్వరలో BRSలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న ఆయన.. రానున్న ఎన్నికల్లో తన కోడలు చరిష్మా రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కమిట్మెంట్‌లు తీసుకున్న ఆయన, కారు ఎక్కేందుకు సమాయత్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

News April 1, 2026

కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో పీజీ (ఆర్ట్స్, సైన్స్) కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 23 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 – మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్సిటీ పరిధిలోని 5 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని KRU అధ్యాపకులు తెలిపారు.

News April 1, 2026

భద్రాద్రి: ఈనెల 7 నుంచి సదరం క్యాంపులు

image

భద్రాద్రి జిల్లాలో ఈనెల 7నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల కోసం సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో 16 కేటగిరీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సదరం క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 7, 8, 10, 15, 17, 21, 24, 28 తేదీలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.