News March 8, 2025

కామారెడ్డి జిల్లాలో డ్రగ్స్ పట్టివేత

image

అక్రమంగా రవాణా చేస్తున్న 250 గ్రాముల నిషేధిత డ్రగ్, ఆల్ఫాజోలంను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు KMRలో పట్టుకున్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ అల్పాజోలంను ముగ్గురికి విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి బైక్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ స్వప్న, ఎస్ఐ రామ్ కుమార్, విక్రమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 25, 2026

ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ మహిళ!

image

విజయవాడ <<19463245>>ఉగ్రకుట్ర<<>> కేసులో హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా యువతను తీవ్రవాద సంస్థలవైపు మళ్లించడంలో సయిదా కీలక పాత్ర పోషించింది. ఇటీవల పట్టుబడ్డ సోహైల్ బేగ్, షరీఫ్, డ్యానిష్‌ను కూడా ఈమెనే ఉచ్చులోకి తీసుకొచ్చింది. విజయవాడకు తరలించి సయిదా బేగంను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 25, 2026

ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా 9 సీట్లు పెరిగే ఛాన్స్!

image

ఉమ్మడి వరంగల్‌లో జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాలు 9 పెరిగి 21 అయ్యే అవకాశం కనిపిస్తోంది. HNKలో 2 సీట్లుండగా కొత్తగా మరో 4, WGLలో 3 ఉండగా మరో 2, BHPLలో 1 ఉండగా మరొకటి, MHBDలో 2కి అదనంగా మరో 2 పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జనగామ(3), ములుగు(1)లో మాత్రం పెరిగే అవకాశం లేదు. WGL-HNK జిల్లాలో జనాభా 20 లక్షలకు పైగా ఉండటంతో ఇక్కడే 6 స్థానాలు, మానుకోటలో 8 లక్షల జనాభాతో 4 సీట్లు కొత్తగా రాబోతున్నాయి.

News March 25, 2026

ఇంధన సమస్యపై నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. నేడు సభలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై చర్చించేందుకు BRS సిద్ధమైంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసన సభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.