News March 8, 2025

మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజ పురోగతి: కేసీఆర్

image

మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజ పురోగతి ఉంటుందని మాజీ సీఎం కెసిఆర్ శనివారం సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు ఈ సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారిత సాధ్యమైనప్పుడే దేశాభివృద్ధి పూర్తిగా సాకారమవుతుందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Similar News

News March 19, 2026

బాపట్ల జిల్లాలో 8 మంది పోలీసులకు పురస్కారాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలలో బాపట్ల జిల్లాకు చెందిన 8 మంది పోలీసు అధికారులు ఎంపికైనట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఏడుగురికి సేవా పతాకాలు, ఒకరికి ఉత్తమ సేవా పతకం లభించనందున్నారు. చీరాల డీఎస్పీ మోయిన్, చీరాల వన్ టౌన్ ఏఎస్ఐ పల్లా సత్యనారాయణ, ఎస్బీ ఏఎస్ఐ హరిప్రసాదరావుతోపాటు పలువురు పురస్కారాలకు ఎంపికైనట్లు వివరించారు.

News March 19, 2026

GNT: ‘ఫిజిక్స్ పాఠాలు చెబుతానని తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యం’

image

గుంటూరులోని శ్రీనగర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై, అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉభయ కుటుంబాల మధ్య ఉన్న చనువును ఆసరాగా చేసుకున్న నిందితుడు, ఫిజిక్స్ పాఠాలు చెబుతానంటూ బాలికను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 19, 2026

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: మంత్రి పొన్నం

image

రాష్ట్ర ప్రజలకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.