News March 8, 2025
SRPT: పంక్చర్లు వేస్తూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ..

25 ఏళ్లుగా పంక్చర్ షాపు నడుపుతూ తన ఇద్దరి కుమారుల చదువుకు ఆసరాగా నిలుస్తున్నారు తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన గృహిణి బత్తిని పుష్ప. భర్త యాకయ్య గౌడ్ వృత్తికి తోడుగా కుటుంబ బాధ్యతలు పంచుకుంటూ పంక్చర్ షాపు చూసుకుంటున్నారు. లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలకు పంక్చర్లు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. స్వయం ఉపాధితో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ అమ్మ కథ ఎంతో మంది మహిళలకు ఆదర్శం.
Similar News
News March 21, 2026
SRP: ఎస్సారెస్పీ కాలువల విస్తరణకు భారీగా నిధులు

జిల్లాలోని SRSP స్టేజ్-2 కాలువల విస్తరణ, అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకోనుంది. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుకే ఈసారి బడ్జెట్‌లో ఈ పనులకు నిధులు పెంచింది. గతేడాది కేవలం రూ.34.01 కోట్లు మాత్రమే ఇవ్వగా.. ఈసారి ఏకంగా రూ.276.86 కోట్లను మంజూరు చేసింది. అదనంగా ఇచ్చిన ఈ రూ.242.85 కోట్లను ప్రధానంగా కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కోసమే ఖర్చు చేయనున్నారు.
News March 21, 2026
ఖమ్మం: మూడు నెలల బియ్యం ఒకేసారి!

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఖమ్మంలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సుమారు 8 లక్షల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలోనే మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఎండల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాకు 2.15 కోట్లు, భద్రాద్రికి 1.83 కోట్ల కిలోల సన్నబియ్యాన్ని ఇప్పటికే కేటాయించారు.
News March 21, 2026
ధురంధర్-2 తెలుగు వెర్షన్ నేటి నుంచే..

ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్-2 గురించి తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ధురంధర్-2ను తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19న మూవీ రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు.


