News March 8, 2025
ఈస్ట్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన అంకిత్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీగా అంకిత్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈరోజు ఉదయం ఈస్ట్ జోన్ కార్యాలయాన్ని చేరుకున్న అంకిత్ కుమార్.. డీసీపీ రవీందర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ పరిధిలోని అధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు.
Similar News
News July 5, 2025
IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.
News July 5, 2025
దంతాలపల్లి దాన కర్ణుడు చిన్న వీరారెడ్డి మృతి

దంతాలపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్, జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాన కర్ణుడిగా పేరొందిన యెల్లు చిన్న వీరారెడ్డి(85) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం మరణించారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు చిరకాలం స్మరించుకుంటామని గ్రామస్థులు పేర్కొన్నారు.
News July 5, 2025
నవాబ్‌పేట: ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వెరిఫికేషన్

నవాబ్ పేట మండలం దేపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వెరిఫికేషను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్ నిర్ణయించిన కొలతల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఇసుక సమస్యపై ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, కమిటీ మెంబర్స్‌తో చర్చించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, MPDO, MRO, MPO తదితరులు పాల్గొన్నారు.