News March 8, 2025

దుద్యాల: ఇప్పటికే రూ. 46.20 కోట్లు అందుకున్న రైతులు !

image

దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, రోటిబండ, హకీంపేట, పులిచర్లలో కారిడార్ నిర్మాణం కోసం 233ఎకరాల భూమిని రేవంత్ ప్రభుత్వం సేకరించింది. దీంతో రైతులకు పరిహారంగా మొత్తం రూ.46.20కోట్లు అందించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒకవైపు రైతుల్లో ఆనందం మరోవైపు అధికారులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు స్టే విధించినప్పటికీ శుక్రవారం రోజు అధికారులు మళ్లీ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Similar News

News March 13, 2026

జగిత్యాల: జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కారాగారంలో శుక్రవారం ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెచ్ఐవి, హెపటైటిస్ B, Cతో పాటు రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల పాథాలజిస్ట్ డా. కె. ప్రవీణ్, ఖిలగడ్డ వైద్యాధికారి డా. సంతోష్, ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: SP

image

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పరీక్షా సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News March 13, 2026

GNT: జగన్ పర్యటన వాయిదా.. ఇఫ్తార్ రాజకీయమే కారణం..!

image

గుంటూరులో ఇఫ్తార్ రాజకీయం రాజుకుంటుంది. ఇందుకు కారణం గుంటూరులో ఈ నెల 10న జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన ఇఫ్తార్ విందు వాయిదా పడటమే అని YCPలో చర్చ జరుగుతుంది. లోకల్ నాయకుల ఆధిపత్యం కాస్త జగన్ పర్యటన వాయిదాకు కారణమైందని అంటున్నారు. స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కంటే క్రెడిట్ ఎవరిది అన్నదే పెద్ద చర్చ నడిచిందని, తూర్పు ఇన్‌ఛార్జ్ ఏర్పాట్లు కంటే హడావిడి చేస్తున్నారని కొందరు నేతలు మాట్లాడుకున్నారు.