News March 8, 2025

మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించిన MHBD ఎస్పీ

image

MHBD జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలలో సంకల్పశక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని, పురుషులకంటే మహిళలు వివిధ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారన్నారు.

Similar News

News March 17, 2026

ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 821 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 24 మంది ప్రమోట్ కాగా, 246 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) జి. ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.

News March 17, 2026

పోలవరం: ఇంటర్ పరీక్షలు.. 79మంది గైర్హాజరు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 10 కేంద్రాల్లో కెమిస్ట్రీ పరీక్షకు 1,219 మందికి గాను 1,140 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా పర్యవేక్షకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారి చాణుక్యుడు రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు కేంద్రాలను స్వయంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.