News March 8, 2025
ఛెత్రీ రిటైర్మెంట్ వెనక్కి: మాజీ కెప్టెన్ ఏమన్నారంటే?

సునీల్ ఛెత్రీ రిటైర్మెంటును వెనక్కి తీసుకోవడంపై ఫుట్‌బాల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది టీమ్ఇండియాకు షార్ట్‌టర్మ్‌లో మేలు చేసినా లాంగ్‌టర్మ్‌లో కీడేనని మాజీ Capt బైచుంగ్ భుటియా అంటున్నారు. దేశ ఫుట్‌బాల్ ఎదగాలంటే బాల్యం నుంచే ఫార్వర్డ్స్‌కు దూకుడుగా శిక్షణనిచ్చే బ్రెజిల్, స్పెయిన్ విధానం అనుసరించాలని సూచించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించి, పటిష్ఠ ఎంపిక విధానం సృష్టించాలని కోరారు.
Similar News
News January 25, 2026
మీ కరెంట్ బిల్లు పంపండి.. WFH ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్

వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే తమ ఉద్యోగులను ఇంటి కరెంట్ బిల్లు షేర్ చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్ ఇటీవల మెయిల్ పంపింది. కంపెనీ రీస్ట్రక్చరింగ్‌తో దీనికి సంబంధం లేదని.. ఆందోళన చెందొద్దని తెలిపింది. కంపెనీ విద్యుత్తు వినియోగంతో పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ యూసేజ్‌ను తగ్గించాలని పెట్టుకున్న తమ లక్ష్యాన్ని గుర్తుచేసింది.
News January 25, 2026
వెనిజులాపై సైనిక దాడి.. 15నిమిషాలే టైమిచ్చారు: డెన్సీ రోడ్రిగ్జ్

వెనిజులాపై అమెరికా సైనిక దాడిలో ఎదురైన సవాళ్ల గురించి తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ సంభాషణ వీడియో లీకైంది. తమ డిమాండ్లను అంగీకరిస్తారా? లేక చస్తారా? అని అమెరికా దళాలు బెదిరించినట్లు అందులో రికార్డైంది. తనతోపాటు ఇంటర్నల్ మినిస్టర్ డియోస్డాడో కాబెల్లో, మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్‌కు 15నిమిషాలు టైమ్ ఇచ్చారన్నారు. మదురో ఆయన భార్యను చంపేసినట్లు యూఎస్ దళాలు ముందుగా తమకు చెప్పాయని తెలిపారు.
News January 25, 2026
Republic day Special : దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ గాంధీజీ పిలుపు మేరకు ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. 1929లో మహిళా ఉద్ధరణకు మద్రాసులో ‘ఆంధ్ర మహిళా సభ’ను స్థాపించారు. ఈ పేరుతోనే హైదరాబాదులోనూ 1958లో స్థాపించి స్త్రీ జనోద్ధరణకు సహాయకారిగా నిలిచారు.


