News March 8, 2025

బాపట్ల జిల్లాలో క్రీ.శ. 1871 నాటి వివిధ పట్టణాల జనాభా.!

image

బాపట్ల జిల్లాలో 1871వ సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు మొత్తం జిల్లా జనాభా 15,48,480 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,80,588 మంది కాగా మహిళలు 7,67,892 మందిగా నమోదయ్యారు. అప్పటి పట్టణాల వారిగా బాపట్ల-6,086 మంది, చీరాల-9,061మంది ఉన్నారు. 1881 సంవత్సరంలో జనాభా గణన ప్రకారం 1871 కన్నా పురుషుల పెరుగుదల శాతం 5.84 కాగా, స్త్రీల పెరుగుదల శాతం 7.42గా ఉంది.

Similar News

News March 17, 2026

GWL: కేజీబీవీ లకు కేటాయించిన బడ్జెట్ వినియోగించాలి

image

కేజీబీవీలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కేజీబీవీలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమతి లేకుండా ఎవరిని పాఠశాలలోకి అనుమతించరాదన్నారు. విద్యార్థుల సంక్షేమం, భద్రతపై ప్రిన్సిపాళ్లు దృష్టి పెట్టాలన్నారు.

News March 17, 2026

HNK: కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లకు ఊరట

image

అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా ఛార్జీల విధింపులో ఊరట లభించిందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు. నూతన విధానంతో ఈ కేటగిరిలో మార్కులు జరిగాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం ఉండదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే ఉంటుందన్నారు.

News March 17, 2026

ఉపాధి హామీ చట్టంపై నీలినీడలు: వైఎస్ షర్మిల

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వీబీజీ రాంజీ చట్టం వల్ల ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్ల పరమవుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అరకులోయ మండలం మాడగడలో జరిగిన MGNREGA చట్టం పరిరక్షణ యాత్ర సభలో ఆమె మాట్లాడారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు 40% నిధులు భరించడం అసాధ్యమని, ఇది పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. కూలీల హక్కులను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.