News March 8, 2025
మహిళా దినోత్సవ వేడుకల్లో ఓరుగల్లు జిల్లా మహిళామణులు

మహిళల అభివృద్ధి దేశ పురోగతి సాధ్యమవుతుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మానవునిగా ఆలోచిస్తే మహిళ, పురుష లింగ అసమానత్వం ఉండదని, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన జరగదని కలెక్టర్ అన్నారు.
Similar News
News March 9, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

వరంగల్లో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చాలా మంది మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
News March 9, 2025
వరంగల్: లోక్ అదాలత్‌లో 17,542 కేసులు పరిష్కారం

వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో శనివారం ఈ ఏడాది మొదటి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మల గీతాంబ, సీఎహ్.రమేశ్ బాబు పాల్గొని వివిధ కోర్టుల నుంచి 17 బేంచిలను ఏర్పాటు చేసి మొత్తం 17,542 కేసులు పరిష్కరించారని తెలిపారు. అనంతరం కేసులు ఉన్నవారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
News March 8, 2025
రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం అందజేత

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ ఎంపి కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే నష్కల్ నుంచి హసన్‌పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన రైల్వే బైపాస్ లైన్లను ORR చుట్టూ అలైన్‌మెంట్ చేయాలని కోరారు.