News March 23, 2024
హైదరాబాద్‌లో నివాసాల మధ్య వ్యభిచారం..!

హైదరాబాద్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు RAIDS కొనసాగిస్తున్నారు. మధురానగర్ PS పరిధి ఇంజినీర్స్ కాలనీలో నివాసాల మధ్య రమేశ్ గుప్తా అనే వ్యక్తి ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు చేశారు. స్పాట్‌లో సబ్‌ఆర్గనైజర్ అనిత, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ చేశారు.
Similar News
News September 8, 2025
HYD: అటు ఆనందం, ఇటు ఆర్తనాదం

అందరిదేమో ఆనందం.. కొందరిదేమో ఆర్తనాదం. బొమ్మ బొరుసు వలే ఈ రెండు ఉంటాయనడానికి పైఫొటో ఉదాహరణ. ఆదివారం ట్యాంక్‌బండ్ మీద నిమజ్జనోత్సవంలో కొన్ని దృశ్యాలు ఉత్సాహం నింపితే, మరికొన్ని గుండెను బరువెక్కించాయి. ఆటపాటల్లో మునిగిన సెక్రటేరియట్ ఎదుట మాసిపోయిన చీర, ఒంటినిండా గాయాలతో ఓ తల్లి భిక్షాటన చేసింది. దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడు దీనంగా చూస్తుండిపోయాడు. వారి బతుకు చిత్రం చూసి భక్తులు చలించిపోయారు.
News September 8, 2025
వామ్మో: HYDలో 32 వేల టన్నుల వ్యర్థాల తొలగింపు

సిటీలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక శానిటేషన్‌పై GHMC ఫోకస్ చేసింది. నిన్నటి వరకు 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించింది. పారిశుద్ధ్య కార్మికులు రోజుకు 1500 నుంచి 1600 టన్నుల చెత్తను సేకరించి, జవహర్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. సాగర్‌లో 12 వేల టన్నుల విగ్రహ వ్యర్థాలు బయటపడటం గమనార్హం. ప్రస్తుతం నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాలలో పనులు కొనసాగుతున్నాయి.
News September 8, 2025
HYD: 17 ఏళ్లుగా లడ్డూ సొంతం

హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్1 బస్తీలో ఓ భక్తుడు 17 సంవత్సరాలుగా వేలం పాటల్లో లడ్డూను సొంతం చేసుకుంటున్నాడు. హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్1 బస్తీలో మండపం వద్ద మునేశ్వర్ తొలిసారి రూ. 600 నుంచి చెల్లించి లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత వరుసగా పదహారు సంవత్సరాలు ఆయనే లడ్డూను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా రూ 2.10 లక్షలకు మరోసారి లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం.