News March 8, 2025
NRPT: SALUTE మహిళలు.. అనుకుంటే అద్భుతాలే!

ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్‌కి చెందిన గోపాల్, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు చిన్నప్పటినుంచి కష్టాలు అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రూప PDగా, దీప SGTగా, శిల్పా వెటర్నరీ అసిస్టెంట్‌గా, పుష్ప PETగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మహిళలు అనుకుంటే అన్ని రంగాల్లో అద్భుతాలే అని నిరూపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Way2News ప్రత్యేక కథనం.
Similar News
News July 4, 2025
నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆర్థిక, సామాజిక కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి, లేదా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. అడ్మిషన్లు జూన్ 12 నుంచి ఆగస్టు 12 వరకు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. SHARE IT
News July 4, 2025
దివ్యాంగులకు ఉపకరణాల దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి టీడబ్ల్యూఓ శిరీష తెలిపారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2025-26 ఆర్థిక సం.రానికి శారీరక వైకల్యం ఉన్నవారికి, అంధులకు మానసిక దివ్యాంగుల సహాయార్థం రెట్రోఫీటెడ్ మోటర్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్, అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.
News July 4, 2025
భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.