News March 8, 2025

అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి ఏమన్నారంటే?

image

AP: మార్చి 12 నుంచి 15లోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య ఖరారు చేసిన డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని, న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్లేందుకు 7 నెలల సమయం పట్టిందన్నారు. భూములు అమ్మి మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తామని, ప్రజల పన్నుల ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టబోమని స్పష్టం చేశారు.

Similar News

News July 4, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 జాబ్స్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,500 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాంకుల్లో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జులై 24. ప్రారంభ వేతనం నెలకు రూ.48,480. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 4, 2025

రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

image

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.

News July 4, 2025

నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.