News March 8, 2025

మహిళల అభివృద్ధికి ప్రోత్సహించాలి: జడ్జి షితాల్

image

అభివృద్ధి సాధించినప్పుడు సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని జడ్జి షీతాల్ పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కోర్టులో భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళ న్యాయవాదులను జడ్జీలను సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. మహిళలు అందుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగాలన్నారు.

Similar News

News November 10, 2025

జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

image

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.

News November 10, 2025

అత్యాచార బాధితురాలిపై లాయర్ ఘాతుకం

image

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అత్యాచారం చేశాడో లాయర్. UPలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2022లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును కోర్టు బయట సెటిల్ చేస్తానని నిందితుల్లో ఒకరి లాయర్ జితేంద్ర సింగ్ యువతి(24)ని నమ్మించాడు. హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకుని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటిపై నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.

News November 10, 2025

NSUTలో 176 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (<>NSUT<<>>)లో 176 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్, BS, ME, ఎంటెక్, MS, PhDతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35- 50 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsut.ac.in/