News March 9, 2025

కేంద్రమంత్రితో పరిశ్రమల భూమిపూజలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

image

పరిశ్రమలను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న 4 ప్లాంట్లకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. అమరరాజా గిగా ఫ్యాక్టరీ -1, ఆల్టిమిన్, లోహమ్ మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు భూమిపూజ జరిగింది.

Similar News

News March 8, 2026

NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

image

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.

News March 8, 2026

CA ఫలితాలు విడుదల

image

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచినట్లు తెలిపింది. అలాగే ఆలిండియా మెరిట్ లిస్టును అందుబాటులో ఉంచింది. జనవరి 18, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ICAI ఏటా 3 సార్లు(జనవరి, మే/జూన్, సెప్టెంబర్) ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుంది.

News March 8, 2026

బోరవెల్లి ‘కవిపోషక రాణి’ గిరియమ్మ

image

రాజకుమారి గిరియమ్మ బోరవెల్లి కోట సంస్థాన చినసోమభూపాలుడి భార్య. సంతానం లేకపోవడంతో పెద్దసోమభూపాలుని కుమారుడు వెంకటపతిని దత్తత తీసుకున్నారు. గద్వాల కవులు-పండితులను పోషించి కవిపోషక రాణిగా పేరు తెచ్చుకున్నారు. దత్తపుత్రుడు వెంకటపతి కూడా తల్లికి తగ్గట్టుగా సాహిత్యాన్ని ఆదరించారు. 1668లో వెంకటపతి సంస్థానాన్ని గద్వాలలో విలీనం చేసి తన పుట్టినిల్లు గద్వాల సంప్రదాయాన్ని బోరవెల్లిలో తెచ్చి కీర్తిని తెచ్చారు.