News March 9, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>10న రంపచోడవరంలో గ్రీవెన్స్ డే>పాడేరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభం>చింతపల్లి: ఉదయం చలి..మధ్యాహ్నం ఎండ>అల్లూరి: తేనె సేకరణ ధర పెంపు>పాడేరులో ఘనంగా మహిళా దినోత్సవం>చింతూరు: ఏజెన్సీ సమస్యలపై 26న ధర్నా>పాడేరు: జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు>అరకు: మహిళా దినోత్సవ ర్యాలీలో సినీ నటులు>రంపచోడవరంలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Similar News

News September 15, 2025

సంగారెడ్డి: ప్రజా పాలన వేడుకలకు హాజరు కానున్న మంత్రి

image

సంగారెడ్డి పరేడు గ్రౌండ్‌లో ఈనెల 17న నిర్వహించే ప్రజా పాలన వేడుకలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని అన్నారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 15, 2025

యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

image

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్‌(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం

News September 15, 2025

సంగారెడ్డి: నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల సెప్టెంబర్ 23లోపు https://www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు.