News March 9, 2025
TODAY HEADLINES

☞ AP: రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు
☞ తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి CBN: లోకేశ్
☞ TG: ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు: సీఎం రేవంత్
☞ గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి.. సీఎంకు మందకృష్ణ లేఖ
☞ గుజరాత్ INCలో కొందరు BJPకి పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ
☞ రేపే CT ఫైనల్.. కోహ్లీకి గాయం!
☞ రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరగలేదు: గిల్
Similar News
News April 18, 2026
వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా బిల్లు?

మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
News April 18, 2026
కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

కోచ్ నావల్‌సింగ్ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.
News April 18, 2026
జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>


