News March 9, 2025
కడప జిల్లాలో వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలి: మంత్రి

జిల్లాలో వెనుకబడిన తరగతుల వర్గాలను బలోపేతం చేసి ముందుకు నడిపించాలని బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. శనివారం కడపలోని ఆర్& బి అతిధి గృహంలో.. బీసీ సంక్షేమ శాఖాధికారులు, చేనేత జౌళిశాఖ అధికారులతో.. సమీక్షా సమావేశం నిర్వహించారు. సవిత మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు.
Similar News
News March 10, 2025
కడప: యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కడప కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను నేరుగా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 9, 2025
ప్రొద్దుటూరులో భార్యాభర్తలను కలిపిన జడ్జి

ప్రొద్దుటూరు కోర్టులో నిన్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివా రెడ్డి శుక్రవీణను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సాప్ట్వేర్ ఇంజినీర్లు అయిన భార్యాభర్తలు చిన్నపాటి వివాదంతో విడిపోయారు. భార్య జాతీయ లోక్ అదాలత్ను ఆశ్రయించగా జడ్జి సత్యకుమారి భర్తతో మాట్లాడారు. జడ్జి సూచనలతో భార్యాభర్తలు ఒకటయ్యారు.
News March 9, 2025
అనారోగ్యంతోనే నా బిడ్డ మృతి: YS అభిషేక్ తండ్రి

తన బిడ్డ మృతిపై దుష్ర్పచారం చేయడం బాధాకరమని YS అభిషేక్ రెడ్డి తండ్రి YS మదన్ మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘వివేకా హత్య కేసు సాక్షులంతా అనుమానాస్పదంగా చనిపోతున్నారని కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారం చేస్తున్నాయి. నా కుమారుడు అనారోగ్యంతోనే చనిపోయాడు. గంగిరెడ్డి, వాచ్మెన్ రంగన్న సైతం ఆరోగ్యం సరిగా లేక కన్నుమూశారు. ప్రభుత్వం సిట్ అంటోంది. అది కాదు జ్యుడీషియల్ విచారణ చేపట్టండి’ అని ఆయన కోరారు.