News March 9, 2025
30వ తేదీ నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల 12న ముగుస్తాయి. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చైత్ర మాసంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. ఈ పవిత్రమైన రోజున శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది.
Similar News
News December 4, 2025
విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.
News December 4, 2025
పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
News December 4, 2025
ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.


