News March 9, 2025
జాతీయ లోక్ అదాలత్‌కు 49,056 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో 49,056 కేసులు పరిష్కారం అయినట్టు న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెలహరి, హైకోర్టు న్యాయ సేవ కమిటీ చైర్మన్ రావు రఘునందన్ రావు శనివారం తెలిపారు. రెండో శనివారం హైకోర్టులో, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోకదాలత్ నిర్వహించబడిందన్నారు. రూ.3,260 కోట్లు పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేసినట్టు కార్యదర్శి భబిత తెలిపారు.
Similar News
News March 16, 2026
GNT: గ్యాస్ సరఫరాపై అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, పారదర్శక సేవలు అందించాలన్నారు.
News March 16, 2026
అమరజీవి త్యాగం.. తెలుగు జాతికి పునాది: మంత్రి సవిత

అమరావతిలో 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు. అమరావతిలోని సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావించిందన్నారు. నేటి తెలుగు ప్రజల ఉనికి పొట్టి శ్రీరాముల పోరాటంతోనే సాధ్యమైందన్నారు.
News March 16, 2026
GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


