News March 9, 2025
గిగా కంపెనీతో పాలమూరు రూపురేఖలు మారతాయి: కేంద్ర మంత్రి

అమర్ రాజా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా రూ.3,225 కోట్లతో నిర్మిస్తున్న గిగా ఫ్యాక్టరీతో పాలమూరు రూపురేఖలు మారడం ఖాయమని కేంద్ర రైల్వే శాఖ సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో కంపెనీ ప్రారంభం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ప్లాంటును పరిశీలించారు.
Similar News
News September 13, 2025
MBNR: యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశం

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
News September 12, 2025
MBNR: ‘ఉర్దూ ఘర్’ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ నాయకుల డిమాండ్

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.
News September 12, 2025
MBNR: OCT 16న PUలో స్నాతకోత్సవం

పాలమూరు యూనివర్సిటీలో వచ్చేనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కె.ప్రవీణ Way2Newsతో తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్స్‌లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.