News March 9, 2025

సూర్యాపేట: జిల్లాలో విద్యుత్ సమస్యల్లేవు: కలెక్టర్

image

SRPT జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాల్టీలు, 819 హ్యాబిటేషన్స్‌లలో 2.27 లక్షల గృహాలు ఉన్నాయని 705 అవాసాలు గ్రీన్,79 ఆరెంజ్, 32 ఎల్లో, 4 ఆవాసాలు రెడ్ జోన్‌లలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. శనివారం ఉమ్మడి నల్గొండలో తాగు నీటిపై నిర్వహించిన సమీక్షలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిచామన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

Similar News

News March 4, 2026

సంగారెడ్డి జైలు సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ బాధ్యతలు

image

సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగార సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఇదే జైలులో పనిచేసిన ఆయన జూన్‌లో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. తాజాగా ప్రభుత్వం తిరిగి ఆయన్ని సంగారెడ్డికే నియమించడంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జైలు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 4, 2026

HNK: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్‌కు 98% హాజరు

image

నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్‌కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

News March 4, 2026

బిహార్ సీఎంగా బీజేపీ నేత?

image

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.