News March 9, 2025

అనకాపల్లి: యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీ నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 24, 2026

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ చేపట్టిన బోర్డు ఫలితాలను APR 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 8లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. సిలబస్ మారడం, సబ్జెక్టుల ఎలెక్టివ్ విధానం వల్ల పరీక్షలు విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల 30రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కాగా మే మొదటివారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది.

News March 24, 2026

రామ్ పోతినేని కొత్త సినిమా ఫిక్స్?

image

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు అసోసియేట్‌గా పనిచేసిన లోగి విఘ్నేశ్‌తో ఆయన సినిమా చేయనున్నట్లు పేర్కొన్నాయి. కథా చర్చలు జరిగాయని, హీరో స్టోరీని ఓకే చేశారని తెలిపాయి. 2026లోనే రిలీజయ్యే ఛాన్సుందని చెప్పాయి. కాగా రామ్ చివరగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాని సంగతి తెలిసిందే.

News March 24, 2026

కోనసీమ: భద్రాచలం శ్రీరామ నవమికి ఈ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు

image

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి భద్రాచలానికి 15 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26 నుంచి అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అమలాపురం డిపో నుంచి 26న ఉదయం 9:30, 10:30, మధ్యాహ్నం 12:30, 1:30, 3:00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని ఆయన పేర్కొన్నారు.