News March 9, 2025
కామారెడ్డి: బాధితురాలి వద్దకే జడ్జి

కామారెడ్డిలోని జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా అదనపు జూనియర్ న్యాయమూర్తి దీక్ష బట్టు ఒక కేసులో బాధితురాలు వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు స్వప్న నడవలేని స్థితిలో ఉండటంతో ఆమె వద్దకు వెళ్లారు. కేసు విషయంలో రాజీ కుదిర్చరు. వెంట న్యాయవాదులు జడల రజనీకాంత్, వేణు ప్రసాద్ ఉన్నారు.
Similar News
News March 8, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 8, 2026
పోలవరం: అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు చుక్కెదురైంది. ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ల నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
News March 8, 2026
మెకుతు సీమలో అన్నింటా ‘ఆమె’

అన్నిరంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఆయా నుంచి కలెక్టర్ వరకు తమ మార్కు చూపిస్తున్నారు. మెతుకుసీమలోని మూడు జిల్లాల కలెక్టర్లు, సీపీ మహిళలే. ప్రభుత్వ కీలకశాఖల్లో, పల్లెలు, పట్టణాల్లో ప్రజాప్రతినుధులుగా, ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్షురాలుగానూ మహిళామణులు రాణిస్తున్నారు. అటుపరిపాలనలో.. ఇటూ రాజకీయాల్లో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు మెతుకు సీమ మహిళామణులు.
Happy Women’s Day


