News March 9, 2025

SRD: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ఝరాసంఘంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ తెలిపారు. 1వ తరగతిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, ఈనెల 21 వరకు https://kvsangathan.nic.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News December 28, 2025

Silver.. సారీ..! Stock లేదు!

image

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.

News December 28, 2025

మెదక్: సండే స్పెషల్.. నాటు కోళ్లకు డిమాండ్

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సండే సందడి కనిపిస్తోంది. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ దుకాణాలకు దారి తీస్తున్నారు. బాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వాటిపైనే మక్కువ చూపుతున్నారు. బాయిలర్ రూ.200, మటన్ రూ.800, నాటుకోడి ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతోంది. మీ ప్రాంతాల్లో ధర ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.

News December 28, 2025

EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(<>ED<<>>)లో 75 కాంట్రాక్ట్ లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. LLB/LLM ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://enforcementdirectorate.gov.in