News March 9, 2025
VZM: విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.
Similar News
News April 3, 2026
VZM: ఆ ఉద్యోగులకు నేటి నుంచి సెలవులు లేవు

వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నేటినుంచి సెలవులు లేవని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అధికారులు తెలియజేశారు. వైద్యసేవ ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మెలో పాల్గొనడం వల్ల జిల్లాలో వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి సాయిరాం తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించే వరకు సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహించాలని కోరారు.
News April 3, 2026
VZM : అమరావతి రాజధానిపై కలెక్టర్ హర్షం

ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ దేశ పార్లమెంటు చారిత్రాత్మక బిల్లును ఆమోదించడంపై కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు అని ఆయన అభివర్ణించారు. కలెక్టర్ మాట్లాడుతూ..సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. రాజధాని ఏర్పాటు వల్ల భారీగా పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.