News March 9, 2025
పార్వతీపురం: రాజీమార్గమే రాజమార్గం

రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి, వివాదాలను చక్కదిద్దుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోందని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎస్. దామోదరరావు అన్నారు. శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివాదాలు ఒకసారి ప్రారంభమైతే, జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయని, వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు.
Similar News
News March 4, 2026
పద్మావతి అమ్మవారి సేవలో ప్రముఖులు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బుధవారం కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు రమేశ్, ముని చెంగల్రాయులు, ఏవీఎస్వో రాధాకృష్ణ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
News March 4, 2026
త్వరలో ఢిల్లీకి కేసీఆర్?

TG: రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై మౌనంగా ఉన్న BRS చీఫ్ KCR త్వరలో పూర్తిస్థాయిలో యాక్టివ్ కానునట్లు తెలుస్తోంది. APRలో ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. త్వరలో జరిగే TN, WB, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాల రాజకీయ మిత్రులను కలుస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. CMలు స్టాలిన్, మమత, పినరయ్ విజయన్‌లతో KCRకు మంచి సంబంధాలున్నాయి. ఢిల్లీలో BRS ఆఫీసునూ సందర్శిస్తారు.
News March 4, 2026
వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు: కలెక్టర్

జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ RWS అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి పైప్‌లైన్‌ల లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే మరమ్మతులు చేపట్టి నివారించాలని సూచించారు.


