News March 9, 2025
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

సంగారెడ్డి జిల్లాలోని మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదవ తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. https://telanganams.cgg.gov.in/ అనే వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 9, 2026
NZB: ప్రజావాణి 103 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లతో కలిసి ఫిర్యాదుదారుల స్వీకరించారు
News March 9, 2026
ఆయిల్ ధర $200.. ఇరాన్ వార్నింగ్!

బ్యారెల్ క్రూడాయిల్ ధర $200 దాటినా తట్టుకోగలమంటేనే ఈ యుద్ధ క్రీడలోకి దిగండంటూ US బేస్‌లున్న గల్ఫ్ దేశాలను IRGC అడ్వైజర్ ఇబ్రహీం జబారీ హెచ్చరించారు. ఇరాన్ తన ‘మొజాయిక్ డిఫెన్స్’ వ్యూహం ద్వారా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ టెర్మినల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. 31 ఇండిపెండెంట్ కమాండ్లు, నెలకు 10,000 డ్రోన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇరాన్ ఏ క్షణమైనా చమురు ఎగుమతులను అడ్డుకోగలదని జబారీ హెచ్చరించారు.
News March 9, 2026
పుట్టపర్తి: హెచ్‌పీవీ టీకా పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

పుట్టపర్తిలో హెచ్‌పీవీ టీకా పోస్టర్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. 28 ఫిబ్రవరి 2026 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాకు మొదటి విడతగా 6,390 డోసులు వచ్చాయని, వాటిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బాలికల తల్లిదండ్రులు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు.


