News March 9, 2025

వరంగల్ బల్దియాలో మహిళా దినోత్సవ వేడుకలు

image

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనర్ అశ్విని తానాజీ వాకర్డే, మేయర్ గుండు సుధారాణి, మహిళా కార్పొరేటర్లు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. కార్పొరేషన్లో ప్రముఖ పాత్ర పోషించే శానిటేషన్ సిబ్బందిలో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు. 

Similar News

News March 17, 2026

HYD: అమ్మలకు ఏమైంది..!

image

కన్నబిడ్డకు కష్టం రాకూడదని కంచు కవచంలా నిలిచే తల్లే ఇప్పుడు కర్కశంగా మారుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. పసి మోములపై ప్రేమ చల్లాల్సిన చేతులే ప్రాణాలు తీస్తున్నాయి. FEB 24న బౌరంపేటలో 2 నెలల పసివాడిని తల్లి కట్టెల పొయ్యిలో కాల్చి హతమార్చింది. తాజాగా గోల్కొండలో 14 నెలల చిన్నారిని ఊపిరాడనీయకుండా చేసి చంపింది. తల్లితనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.

News March 17, 2026

అసెంబ్లీ నుంచి స్పీకర్ వాకౌట్!

image

ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయడం కామన్. కానీ స్పీకరే వాకౌట్ చేస్తే..? కర్ణాటక అసెంబ్లీలో జరిగిందీ ఘటన. 230 ప్రశ్నల్లో 84 ప్రశ్నలకే మంత్రులు సమాధానాలు ఇవ్వడంతో స్పీకర్ UT ఖాదర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. MLAల ప్రశ్నలకు బదులివ్వాల్సిన మంత్రులే సభకు రావడం లేదని విమర్శించారు. దీనిపై వివరణ ఇచ్చేదాకా సెషన్ నడపబోనని వాయిదా వేసి తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. CM సిద్దరామయ్య సర్దిచెప్పడంతో తిరిగి వచ్చారు.

News March 17, 2026

ట్రంప్‌కు భారీ షాక్

image

హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని US అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన <<19394650>>పిలుపునకు<<>> మిత్ర దేశాలు, చైనా ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు జపాన్ తేల్చిచెప్పాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచించింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.