News March 9, 2025

HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

image

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 3, 2026

బొండపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

image

బొండపల్లి మండలం, మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.

News January 3, 2026

అవుకులో విషాదం

image

అవుకు పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శివరాం(42) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వృత్తి రీత్యా డ్రైవర్‌గా జీవనం సాగించే శివరాం శుక్రవారం తాడిపత్రి అటో నగర్‌లో టిప్పర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. శివరాం మృతితో అవుకు పట్టణంలో విషాదం నెలకొంది.

News January 3, 2026

సామాజిక రుగ్మతల తొలగింపునకు కృషి చేయాలి: కలెక్టర్

image

విద్యార్థులకు బోధనతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బి.ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. శనివారం గద్వాల ఐడీఓసీలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్.. తొలి మహిళా ఉపాధ్యాయురాలి ఆశయాలను కొనసాగించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.