News March 9, 2025
తిరుపతి: తుడా టవర్స్ వేలాన్ని పరిశీలించిన కమిషనర్

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం తుడా టవర్స్ వేలంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ మౌర్య పరిశీలించారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా వేలంపాట నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
అనధికారిక లే ఔట్లు తొలగించాలి: మేయర్

బల్దియా పరిధిలోని అనధికారిక లే ఔట్లను గుర్తించి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో మేయర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనధికారిక లే ఔట్ల ప్లాట్లను కొనుగోలు చేయొద్దని, వీటి పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు.
News July 9, 2025
జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్ఐ

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు చెప్పారు. బాలిక ఫిర్యాతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
News July 9, 2025
మంథని: మహాలక్ష్మి అమ్మవారికి కూరగాయలతో అలంకరణ

మంథని పట్టణంలోని మహాలక్ష్మి దేవాలయంలో జరుగుతున్న ఆషాఢ మాసం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీదేవి అమ్మవారిని కూరగాయలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.