News March 9, 2025

నర్సాపూర్ (జి): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

గొల్లమడ గ్రామ శివారులోని నీరటి బుద్దేశ్వర్ వ్యవసాయ భూమికి దగ్గరలోని అడవిలో వేప చెట్టుకు గొల్లమడ గ్రామానికి చెందిన నీరటి గంగాధర్(44) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య నీరటి సవిత నర్సాపూర్ జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎండీ జలాలుద్దీన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News March 15, 2026

నిమ్మనపల్లె: ‘అతని చదువుకు పేదరికం తలవంచింది’

image

ఏడాది వయసులో తల్లితండ్రులను కోల్పోయి అక్క, మేనమామ ఇంట్లో పెరిగాడు. బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాడు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డొచ్చినా.. వెనకడుగు వేయలేదు. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం, అతని సంకల్పం ముందు పేదరికం తలవచింది. UPSC సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో అన్నమయ్య (D) నిమ్మనపల్లె (M) అగ్రహారానికి చెందిన గోగుల రాజశేఖర్ 920వ ర్యాంకు సాధించాడు.

News March 15, 2026

యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

image

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

News March 15, 2026

పుంగనూరు: కలిసి పుట్టారు.. కలిసి మరణించారు

image

పుంగనూరు పట్టణ త్యాగరాజు వీధిలో బైకు నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరి ఆడక నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కవలలు చరిత, చందన మృతి చెందారు. వీరితోపాటు అన్న కార్తీక్ కూడా మరణించాడు. ఒకేసారి పుట్టి, ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.