News March 9, 2025
ముంబై జట్టులోకి ఆల్‌రౌండర్

గాయంతో ఐపీఎల్ 2025కు దూరమైన లిజాడ్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. 2014లో U19 WC గెలిచిన సఫారీ టీమ్‌లోని కార్బిన్ బాష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు MI ట్వీట్ చేసింది. కాగా 86 టీ20లు ఆడిన కార్బిన్ 59 వికెట్లు తీయగా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పటికే ముంబై జట్టులో హార్దిక్ పాండ్య, సాంట్నర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు.
Similar News
News March 10, 2025
CT: అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(263) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. 4 మ్యాచుల్లో రెండు సెంచరీలు చేశారు. ఇక తర్వాతి స్థానాల్లో భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(243), బెన్ డకెట్(227), జో రూట్(225) ఉన్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ(10W), వరుణ్ చక్రవర్తి(9), సాంట్నర్(9), షమీ(9), బ్రేస్ వెల్(8) ఉన్నారు.
News March 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 10, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.