News March 9, 2025
చికిత్స పొందుతూ రాజన్నపేట యువకుడు మృతి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకి చెందిన నమలికొండ నూతన్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. 2 నెలల క్రితం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట చేస్తూ కళ్ళు తిరిగి స్టవ్‌పై పడిపోవడంతో వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా సగభాగం శరీరం అంటుకుందని వైద్యులు తెలిపారు. హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
Similar News
News February 28, 2026
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. భారతీయులకు అలర్ట్

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్, ఇరాన్, UAE, జోర్డాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దని చెప్పింది. ఎప్పటికప్పుడు వార్ న్యూస్ తెలుసుకుంటూ అవగాహనతో ఉండాలని తెలిపింది. అత్యవసర సహాయానికి తమ దేశంలోని ఎంబసీలను సంప్రదించాలని పేర్కొంది.
News February 28, 2026
పార్వతీపురం: మార్చి నెలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాలో క్రీడా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా.కె.శ్రీధర్ రావు శనివారం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళలు, పురుషులు పార్వతీపురం మన్యం జిల్లా వాసులలై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారుల వయస్సు, కేటగిరీ మేరకు సంబందిత ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు.
News February 28, 2026
BREAKING.. నస్రుల్లాబాద్: కాలేజ్ భవనంపై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.


