News March 9, 2025
అయినవిల్లి: ఆకట్టుకున్న తల్లీకొడుకుల డ్రాయింగ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న డ్రాయింగ్ టీచర్ వేసిన డ్రాయింగ్ పలువురిని ఆకట్టుకుంది. అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉన్న శ్రీఉమామహేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ మహిళా దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News March 10, 2025
రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్: షామా మహ్మద్

కెప్టెన్ రోహిత్ శర్మపై <<15636348>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ CT విజేత భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 76 పరుగులతో జట్టును ముందుండి నడిపిన హిట్ మ్యాన్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రేయస్, రాహుల్ కీలక ఇన్నింగ్సుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని కొనియాడారు.
News March 10, 2025
KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.
News March 10, 2025
మార్చి 10: చరిత్రలో ఈ రోజు

*1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు
*1896: రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం
*1897: సావిత్రిబాయి ఫూలే మరణం
*1982: ప్రముఖ వైద్యుడు జి.ఎస్.మేల్కోటే మరణం
*1990: సినీ నటి రీతూ వర్మ జననం
*అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం