News March 23, 2024
కర్నూలు: టీడీపీని వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి తిక్కారెడ్డి సై?

టికెట్ రాకపోవడంతో తిక్కారెడ్డి, ఆయన అనుచరులు TDP అధిష్ఠానంపై మండిపడుతున్నారు. తన భవిష్యత్ కార్యచరణ కోసం ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా హైకమాండ్ తిక్కారెడ్డిని బుజ్జగించి రాఘవేంద్రరెడ్డి విజయానికి పనిచేసేలా చేయకపోతే గెలుపు కష్టమేనని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 14, 2025
ఉల్లి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను కలెక్టర్ సిరి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఎగుమతుల పరిస్థితి, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి కొనుగోలు విషయంలో ఆలస్యం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పనిసరిగా చెల్లించాలన్నారు.
News September 13, 2025
కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.
News September 13, 2025
సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాను సమిష్ఠి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు కలెక్టర్‌గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.